DRDO Jobs: డీఆర్‌డీవో హైదరాబాద్​లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు కొన్ని రోజులే గడువు

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-23 13:33:40.0  )
DRDO Jobs: డీఆర్‌డీవో హైదరాబాద్​లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు కొన్ని రోజులే గడువు
X

దిశ, వెబ్‌డెస్క్:కేంద్ర ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా హైదరాబాద్(HYD)లోని DRDO అనుబంధ కంపెనీ రీసెర్చ్ సెంటర్ ఇమారత్(RCI)లో తాత్కాలిక ప్రాతిపదికన మొత్తం 22 రిసెర్చ్ ఫెలో(Research Fellow) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.drdo.gov.in ద్వారా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలను పూర్తి చేసి… డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్‌, రిసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ), విజ్ఞాన కంచ, హైదరాబాద్, తెలంగాణ - 500 069’ చిరునామకు పంపించాలి. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 26 అక్టోబర్ 2024.

పోస్టు పేరు, ఖాళీలు:

  • రిసెర్చ్ అసోసియేట్ - 2 పోస్టులు
  • జూనియర్ రిసెర్చ్ ఫెలో - 19 పోస్టులు

విద్యార్హత:

బీఈ/బీటెక్, ఎంటెక్/ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 15 సెప్టెంబర్ 2024 నాటికీ 35 ఏళ్లు మించి ఉండకూడదు. రిజర్వేషన్ ఉన్నవారికి సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

పీహెచ్‌డీ థీసిస్ మార్కులు, దరఖాస్తుల స్క్రూటినీ, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Advertisement

Next Story