- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ .. పూర్తి వివరాలు ఇవే
దిశ, కెరీర్: న్యూఢిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్‌బీ) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన వారు దేశ వ్యాప్తంగా ఎస్ఎస్‌బీ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
కానిస్టేబుల్ (గ్రూప్ సి నాన్ గెజిటెడ్) - 543 పోస్టులు.
కేటగిరి :
వాషర్ మ్యాన్, బార్బర్, సఫాయివాలా, టైలర్, గార్డెనర్, కోబ్లర్, కుక్, డ్రైవర్, వెటర్నరీ, కార్పెంటర్, బ్లాక్ స్మిత్, వాటర్ క్యారియర్, పెయింటర్.
అర్హత: పదోతరగతి సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
వయసు: డ్రైవర్ పోస్టులకు 21 నుంచి 27 ఏళ్లు.
వాషర్ మ్యాన్, బార్బర్, సఫాయివాలా, టైలర్, గార్డెనర్, కోబ్లర్, కుక్, వాటర్ క్యారియర్ పోస్టులకు 18 నుంచి 23 ఏళ్లు ఉండాలి.
ఇతర పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 21,700 నుంచి 69,100 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ట్రేడ్/స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ .. ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరితేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.
వెబ్‌సైట్: http://www.ssbrectt.gov.in/