- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
NET: పీజీ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. నెట్ అప్లికేషన్ డేట్ పొడిగింపు
దిశ, వెబ్ డెస్క్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేక సంవత్సరాలుగా దేశంలోని ప్రతిష్టాత్మక పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ఎప్పటిలాగే.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(JRF), పీహెచ్‌డీ(PHD) ప్రవేశాలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల(Assistant Professors) నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం జూన్, డిసెంబర్ నెలలో రెండు సార్లు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు. కాగా డిసెంబర్ నెలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) గత నెలలో విడుదల చేసింది. అయితే డిసెంబర్ 10 తో అప్లికేషన్ గడువు ముగియడంతో మరొక రోజు పెంచుతూ ఎన్టీ ఏ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 11 రాత్రి 11.59 నిమిషాల వరకు అప్లికేషన్ చేసుకునేందుకు వీలు కల్పించింది.
అలాగే డిసెంబర్ 12 వరకు పేమెంట్, 14 వరకు అప్లికేషన్ ఎడిట్‌కు అవకాశం కల్పించింది. కాగా ఈ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు యూజీసీ(UGC) వెల్లడించింది. మొత్తం 85 సబ్జెక్టుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.ac.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. కాగా ఈ పరీక్షల్లో మూడు రకాల అర్హతలను సాధించేందుకు యూజీసీ ఇటీవల నిర్ణయించింది. (i) 'జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్, (ii) 'అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీ అడ్మీషన్ (iii)'Ph.D ప్రవేశం అడ్మిషన్‌కు అర్హత పొందవచ్చు.