- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
3 పుస్తకాలు రాసిన 6 ఏండ్ల చిన్నారి.. చిల్డ్రన్స్ అవార్డు అందుకున్న అర్మాన్ ఉభ్రాణి
దిశ, ఫీచర్స్ : ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం 2024కి మొత్తం 19 మంది చిన్నారులు అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మొత్తం 19 మంది చిన్నారులను చిల్డ్రన్స్ అవార్డుతో సత్కరించారు. ఎంపిక చేసిన పిల్లలందరిలో ఒక పేరు మాత్రం ఎక్కువగా వినిపిస్తుంది. ఆ చిన్నారి పేరే అర్మాన్ ఉబ్రాని. ఆరేళ్ల ఆ చిన్నారి పేరు ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా నమోదు అయ్యింది. ఇంతకీ అర్మాన్ ఉబ్రాని ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ కి చెందిన చిన్నారి అర్మాన్ ఉబ్రానీ వయస్సు 6.5 సంవత్సరాలు. చిన్నారి తండ్రి వ్యాపారవేత్త కాగా తల్లి ప్లే స్కూల్ ను నడుపుతోంది. అర్మాన్ పింక్ డాల్ఫిన్, ప్లానెక్స్, మై కాంటినెంట్ ఆసియా అనే మూడు పుస్తకాలను రాశారు. ఇది మాత్రమే కాదు, తను 12 నిమిషాల 28 సెకన్లలో 100 విభిన్న సంఖ్యల సమాధానాన్ని సృష్టించారు. దీంతో ఆ చిన్నారి పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు. కళ, సంస్కృతి, ఆవిష్కరణ, క్రీడలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, ధైర్యసాహసాలు వంటి మొత్తం 6 విభాగాలలో పీఎం బాల్ పురస్కార్ ఇవ్వనున్నారు. కళ, సంస్కృతికి సంబంధించిన విభాగంలో అర్మాన్‌కు ఈ అవార్డును అందజేస్తున్నారు. బాల్ పురస్కార్ అవార్డు పొందిన 19 మంది చిన్నారులు జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొననున్నారు. జనవరి 22న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్న చిన్నారులతో జనవరి 23న ప్రధాని మోదీ సంభాషించనున్నారు.