AIR INDIA JOBS: కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ లో.. ఉద్యోగ అవకాశాలు

by Geesa Chandu |   ( Updated:2024-09-25 12:47:26.0  )
AIR INDIA JOBS: కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ లో.. ఉద్యోగ అవకాశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎయిర్ ఇండియా(Air India) ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(Air Transport Services Limited)కు చెందిన కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్(Cochin International Airport) లో.. ఫిక్సుడ్ టర్మ్ కాంట్రాక్ట్(Contract) ప్రాతిపదికన వివిధ భాగాల్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల(Applications)ను కోరుతోంది.

మొత్తం పోస్టులు: 208

విభాగాలు:

హ్యాండీ మెన్/హ్యాండీ విమెన్ పోస్టులు: 201

ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 03

యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 04

అర్హత: 10 వ తరగతి, పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ(ITI), డిప్లొమా(Diploma)(ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్/ప్రొడక్షన్/ఆటోమొబైల్)తో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్(Work Experience) ఉండాలి. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ ఉద్యోగాలకు హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరి ఉండాలి.

వయసు: 28 సంవత్సరాలకు మించకూడదు.(ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ లకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు ర్యాంప్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.24,960; యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ కు నెలకు రూ. 21,270; హ్యాండీ మెన్/విమెన్ పోస్టులకు నెలకు రూ.18,840 వేతనం ఇస్తారు.

ఎంపిక: షార్ట్ లిస్ట్, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

ఆన్ లైన్ లో దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 01, 2024.

ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబర్ 5,7 2024.

ఇంటర్వ్యూ వేదిక: శ్రీ జగన్నాథ్ ఆడిటోరియం, వెంగూర్ దుర్గాదేవి అలయం దగ్గర, వెంగూర్, అంగమలీ, ఎర్నాకులం, కేరళ.

వెబ్ సైట్: https://www.aiasl.in/index

Advertisement

Next Story

Most Viewed