AIIMS JOBS: 'ఎయిమ్స్' లో.. సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

by Geesa Chandu |   ( Updated:2024-09-19 14:32:05.0  )
AIIMS JOBS: ఎయిమ్స్ లో.. సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
X

దిశ, వెబ్ డెస్క్: జార్ఖండ్(Jharkhand) లోని దేవ్ ఘర్ లో ఉన్న ఎయిమ్స్(All India Institute of Medical Sciences)లో.. సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 103

విభాగాలు: కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, పాథాలజీ, అనస్థీషియాలజీ అండ్ క్రిటికల్ కేర్, బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, అనాటమీ, బయో కెమిస్ట్రీ, సర్జికల్ అంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్, ఎండోక్రైనాలజీ, రేడియో థెరపీ ఇంకా ఇతర విభాగాలు

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్/డీఎన్ బీ తో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్(Work Experience) ఉండాలి.

వేతనం: నెలకు ప్రొఫెసర్ పోస్టు(సీనియర్ రెసిడెంట్) కు రూ.67,700.

వయసు: 45 ఏళ్లు మించకూడదు.(ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ లకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది)

అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.3000, ఓబీసీలకు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/మహిళలు/దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆఫ్ లైన్, ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు(Applications) తీసుకోబడును.

ఈమెయిల్: [email protected]

ఆఫ్ లైన్ దరఖాస్తులను ఎయిమ్స్ దేవ్ ఘర్, అకడమిక్ బ్లాక్, దేవీపూర్, దేవ్ ఘర్ చిరునామాకు పంపవలసి ఉంటుంది.

అప్లికేషన్ కు చివరి తేదీ: సెప్టెంబర్ 25, 2024.

వెబ్ సైట్: https://www.aiimsdeoghar.edu.in/

Advertisement

Next Story

Most Viewed