ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో మంటలు..

by Sridhar Babu |   ( Updated:2021-07-22 05:52:41.0  )
car fires news
X

దిశ రాజేంద్రనగర్ : కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో కారులో ఉన్న ఒకరికి తీవ్ర గాయాలు అయిన ఘటన శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల తిమ్మాపూర్ కు చెందిన శ్రీకాంత్ తన ఇండికా కారులో గచ్చిబౌలి వెళ్లడానికి ఔటర్ రింగ్ రోడ్ పై వెళ్తుండగా ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎయిర్‌పోర్ట్ కాలనీ వద్దకు రాగానే ఇండికా కారు ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా మంటల్లో చిక్కుకొని దగ్ధం అయ్యింది. మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ శ్రీకాంత్ ను గమనించిన లారీ డ్రైవర్ అతి కష్టంమీద అతనిని బయటికి తీశాడు. అప్పటికే 40 శాతం పైగా మంటల్లో చిక్కుకొని తీవ్రగాయాలపాలైన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story