మానకొండూరులో ఘోర ప్రమాదం.. సిరిసిల్లలో గుండె తరుక్కుపోయే దృశ్యాలు

by Sridhar Babu |
మానకొండూరులో ఘోర ప్రమాదం.. సిరిసిల్లలో గుండె తరుక్కుపోయే దృశ్యాలు
X

దిశ, చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన ఇందూరి జలంధర్ (30) అనే వ్యక్తి కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జలంధర్ పంచాయతీ రాజ్ ఏఈ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే, ఏఈ తన కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం వెళ్లి తిరిగి వస్తుండగా కారు అతి వేగంగా ప్రయాణించడంతో ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. జలంధర్ మృతదేహం స్వగ్రామం లింగంపేటకు చేరుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. జలంధర్ భార్య హిమాని, కూతురు వేద హన్సీ మృత దేహంపై పడి గుండెలవిసేలా విలపించారు. వారి రోదనలు గ్రామస్తులను కలిచివేశాయి.

Advertisement

Next Story