సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై కారు దహనం

by Shyam |   ( Updated:2021-12-02 09:56:28.0  )
Car burning
X

దిశ, బేగంపేట: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్ సమీపంలోని బ్లూసీ హోటల్ మథర్ తెరిస్సా విగ్రహం వద్ద నడిరోడ్డుపై ఓ కారులో మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది సాయంతో మంటలార్పారు. కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గుర్తించారు. కారు నడిరోడ్డుపై కాలిపోతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story