రోడ్డు ప్రమాదంలో కారు దగ్దం.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

by Sumithra |   ( Updated:2021-10-29 09:42:45.0  )
రోడ్డు ప్రమాదంలో కారు దగ్దం.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
X

దిశ,చిట్యాల: చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులో జాతీయ రహదారి 65 పై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దం అయింది. అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తెలిసిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన విశ్వనాథం, మణికంఠలు విజయవాడలోని తమ బంధువుల ఇంటికి కారులో వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులోని పిట్టంపల్లి క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారి 65 పై కారుకు కుక్కగా అడ్డుగా వచ్చింది. దానిని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టారు. దాంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు గమనించి కారులో ప్రయాణిస్తున్న వారిని బయటకు లాగడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Advertisement

Next Story