కారు బోల్తా.. నలుగురు దుర్మరణం

by Sumithra |   ( Updated:2020-12-09 03:51:00.0  )
కారు బోల్తా.. నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్లలో రోడ్డుప్రమాదం జరిగింది. బుధవారం అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతులు హైదరాబాద్‌లోని బండ్లగూడకు చెందిన శారద, గోవిందమ్మ, హారిక, ఎల్లయ్యగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story