పాక్‌ బౌలర్లను ఎదిరించిన విరాట్.. హాఫ్ సెంచరీ పూర్తి

by Anukaran |   ( Updated:2021-10-24 10:03:58.0  )
పాక్‌ బౌలర్లను ఎదిరించిన విరాట్.. హాఫ్ సెంచరీ పూర్తి
X

దిశ, వెబ్‌డెస్క్: దాయాదుల మధ్య జరుగుతున్న బిగ్‌ఫైట్‌లో ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినప్పటికీ.. కెప్టెన్ కోహ్లీ ఏ మాత్రం బెదరలేదు. ఓ వైపు కీలక ఆటగాళ్లు రోహిత్ (0), కేఎల్ రాహుల్ (3), సూర్య కుమార్ యాదవ్ (11) చేతులెత్తేసినప్పటికీ.. సమయస్ఫూర్తి కనబరుస్తూ జట్టుకు కెప్టెన్ ఇన్నింగ్స్ అందించాడు. 45 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇతడికి తోడుగా మిడిలార్డర్‌లో వచ్చిన రిషబ్ పంత్ 30 బంతుల్లో 39 పరుగులతో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్‌తో పాటు రవీంద్ర జడేజా ఉన్నాడు.

Advertisement

Next Story