క్యాన్సర్ రోగికి కరోనా అటాక్..ఎక్కడంటే

by vinod kumar |   ( Updated:2020-06-12 09:50:15.0  )
క్యాన్సర్ రోగికి కరోనా అటాక్..ఎక్కడంటే
X

దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన క్యాన్సర్ రోగికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు మండల వైద్యుడు అశ్విని కుమార్ తెలిపారు. కొద్ది రోజుల కిందట అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి మండల కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు అతనికి వైరస్ లక్షణాలు ఉండటంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశాడు. శుక్రవారం అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తేలింది. దీంతో గాంధీ వైద్యాధికారులు వరంగల్ రూరల్‌లోని వైద్యునికి సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో అతని ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed