ఏపీలో ప్రైవేట్ కొవిడ్ సెంటర్లపై కొరడా

by Anukaran |
ఏపీలో ప్రైవేట్ కొవిడ్ సెంటర్లపై కొరడా
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ కొవిడ్ కేర్ సెంటర్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. విజయవాడలో ఉన్న 5 ఆస్పత్రులలో తనిఖీలు నిర్వహించి కొవిడ్ కేర్ సెంటర్ అనుమతులను రద్దు చేసింది. ఇందులో రమేశ్ హాస్పిటల్స్ సహా మరో 4 ప్రైవేట్ సెంటర్లు ఉన్నాయి. సర్ణ హైట్స్(రమేష్ ఆస్పత్రి), సన్ సిటీ, కృష్ణ మార్గ్(ఎన్ఆర్ఐ హీలింగ్ హాండ్స్), హోటల్ ఐరా (ఇండో బ్రిటీష్ హాస్పిటల్), హోటల్ అక్షయ(లక్ష్మీ నర్సింహా హోమ్)కు ప్రభుత్వం అనుమతులు రద్దు చేసింది.

Advertisement

Next Story

Most Viewed