- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌కు కెనడా ఆర్థిక సాయం
కెనడా: కొవిడ్-19 తో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు ఆపన్నహస్తం అందించడానికి పలు ప్రపంచ దేశాలు విరివిగా సాయం ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్, యూఎస్, యూకే, జర్మనీ, సింగపూర్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ వంటి దేశాలు సాయం ప్రకటించగా.. తాజాగా ఆ జాబితాలో కెనడా చేరింది. ఈ ఆపత్కాల సమయంలో భారత్‌కు 10 మిలియన్ కెనడీయన్ డాలర్ల (సుమారు రూ. 60 కోట్లు) సాయం అందజేసింది. కెనడా రెడ్ క్రాస్ ద్వారా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఈ నిధులు అందనున్నాయి. ఇదే విషయమై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిస్తూ.. ‘భారత్ ఇప్పుడు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. అంబులెన్స్‌లు, పీపీఈ కిట్లు కొనుగోలు చేసేందుకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా రూ. 60 కోట్లను అందిస్తున్నాం. భారత్‌కు కావాల్సిన ఔషధాలను సైతం ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.
న్యూజీలాండ్ కూడా భారత్‌కు సంఘీభావం ప్రకటించింది. ఈ కష్ట సమయంలో భారత్ వెంట నిలవడం తమ బాధ్యతగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఎన్. మహుతా తెలిపారు. భారత్‌కు తక్షణ సాయం కింద 1 మిలియన్ న్యూజీలాండ్ డాలర్ (సుమారు రూ. 5.30 కోట్లు) ప్రకటించినట్టు పేర్కొన్నారు. కెనడా, న్యూజీలాండ్ తో పాటు ఇండో-అమెరికన్ ఎన్జీవో ‘సేవా ఇంటర్నేషనల్’ కూడా భారత్‌కు బాసటగా నిలిచింది. సోషల్ మీడియా వేదికగా ఫండ్ కలెక్ట్ చేసింది. 100 గంటల్లోనే ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ ద్వారా 4.7 యూఎస్ మిలియన్ డాలర్లు (సుమారు రూ. 30 కోట్లు) సేకరించింది. ఈ మొత్తంతో 2,184 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కొనుగోల చేసి భారత్‌కు పంపించింది.