ఒక క్లిక్‌తో ఇక కిక్కెకిక్కు

by Shyam |
ఒక క్లిక్‌తో ఇక కిక్కెకిక్కు
X

రాష్ట్రంలో మద్యం ప్రియులు ఇక ఆన్​లైన్​లోనే మద్యం కొనుక్కోవచ్చు. ఇందుకోసం టీఎస్ అబ్కారీ శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. సర్కారుకు ఎక్సైజ్ రాబడి భారీగా తగ్గిపోయింది. దీంతో లిక్కర్ కంపెనీలే ఆన్​లైన్​లో మద్యం విక్రయాలకు అనుమతిస్తే బాగుంటుందని సర్కారుకు ప్రతిపాదనలు పంపాయి. పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అమలులో ఉన్నట్టు తెలంగాణలోనూ ఆన్‌లైన్‌లో లిక్కర్ సేల్స్ చేస్తే ఎలా ఉంటుందన్నదానిపై ఎక్సైజ్ అధికారులు చర్చిస్తున్నారు.

దిశ, న్యూ‌స్‌ బ్యూరో : కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో సర్కారుకు ఎక్సైజ్ శాఖ ఆదాయం భారీగా పడిపోయింది. లిక్కర్ సేల్స్ గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తోంది. మరో వైపు లిక్కర్ కంపెనీలకు సేల్స్ పడిపోవడంతో సర్కారుకు కొత్త ప్రతిపాదనలు పంపాయి. ఆన్​లైన్​లోనే మద్యం అమ్మకాలకు అనుమతిస్తే బాగుంటుందని సూచించాయి. దీంతో ఆన్​లైన్​లోనూ మద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది. అయితే రాష్ట్రంలో గతేడాది ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రభుత్వం హోల్ సేల్‌గా నేరుగా ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు జరపడం కుదరదు. లక్షల రూపాయలు చెల్లించి లైసెన్సులు తెచ్చుకున్న రిటైల్ వైన్ షాపుల యజమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. లైసెన్సు ఫీజులు తిరిగి ఇచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడు తుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు.

డెలివరీ యాప్​ల ద్వారా ఆర్డర్లు..

ఈ పరిస్థితుల్లో స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ సంస్థలకు లిక్కర్ సరఫరాకు పర్మిషన్ ఇస్తే సేల్స్ పెంచుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. వైన్​షాపుల నుంచి డైరెక్ట్​ సేల్స్​తోపాటు ఆన్​లైన్​లోనూ అమ్ముకునే చాన్స్ ఉండడంతో ఆదాయం మరింత పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం లిక్కర్ అమ్మకాల్లో 20 శాతం దాకా బార్లు, పబ్బుల ద్వారానే జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 2200 వైన్ షాపులు, 1000 బార్లు, 150 పబ్బులు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed