- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ PAN Card ఒరిజినలా.. కాదా?.. తెలుసుకోండి ఇలా..
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ప్రతీ ఆర్థిక లావాదేవీకి పాన్ కార్డ్ తప్పనిసరి. బ్యాంకుల్లో 50వేలకు పైగా డబ్బులు డిపాజిట్ చేయాలన్నా, విత్ డ్రా చేయాలన్నా పాన్ కార్డ్ ఉండాల్సిందే. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ పాన్ కార్డు విషయంలో నకిలీ కార్డులు సైతం వెలుగు చూస్తున్నాయి. సైబర్ కేటుగాళ్లు ఫేక్ కార్డులతో రెచ్చిపోతున్నారు. అయితే, ప్రస్తుతం ఆధార్ కార్డు ఉంటే చాలు.. నిమిషాల్లో పాన్ కార్డు పొందవచ్చు. ఈ పాన్ కార్డును నిమిషాల్లో తీసుకోవచ్చు. ఎన్ఎస్‌డీఎల్, యూటీఐఐటీఎస్ఎల్ వెబ్‌సైట్ల ద్వారా పాన్ కార్డు కోసం అప్లై చేయొచ్చు. అయితే పాన్ కార్డు ఇంటికి రావాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఈ క్రమంలో మీ పాన్ కార్డు లేదా మీ వద్ద ఉన్న పాన్ కార్డు నకిలీదా.? సరైనదా.? అని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ విషయాన్ని ఎంతో సులభంగా తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు చేయాల్సింది ఏంటంటే.. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ లింక్ ఓపెన్ చేయండి. అక్కడ వెరిఫై పాన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి పాన్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే.. ఆ పాన్ నెంబర్ యూసింగ్‌లో ఉందో లేదో తెలిసిపోతుంది. ఈ విధంగా మీ కార్డ్ సేఫ్ లేదా ఫేక్ అనే విషయం తెలుస్తుంది.
ఈ లింక్ ద్వారా మీ పాన్ కార్డు గురించి తెలుసుకోవచ్చు..
https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/verifyYourPAN