కాల్ చేయండి.. మీ ఇంటి వద్దకే డాక్టర్

by Harish |
కాల్ చేయండి.. మీ ఇంటి వద్దకే డాక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరోగ్య అవసరాలను, సేవలను అందిస్తున్న కాల్‌హెల్త్ సంస్థ హైదరాబాద్‌లో అనారోగ్యంతో బాధపడే వారికి అనుకూలంగా ‘డాక్టర్ ఎట్ హోమ్’ సేవలను సోమవారం ప్రారంభించింది. ఈ సేవల ద్వారా రోగుల ఇంటివద్దకే జనరల్ ఫిజిషియన్ చికిత్స అందించేందుకు వీలు కల్పిస్తుందని కాల్‌హెల్త్ తెలిపింది. వారంలో ఏడు రోజులూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సేవలు లభిస్తాయని, ప్రస్తుతం తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌లలోని ప్రధాన నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్టు కాల్‌హెల్త్ సీఈఓ హరి తాలపల్లి చెప్పారు. త్వరలో దేశవ్యాప్తంగా ‘డాక్టర్ ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని విస్తరించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. వృద్ధులు, డయాబెటిక్, బీపీ, ఆర్థరైటిస్, థైరాయిడ్, ఇంకా ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి నిరంతరం సంరక్షణ అవసరం. ‘డాక్తర్ ఎట్ హోమ్’ ద్వారా రోగి హాస్పిటల్, క్లినిక్‌లకు వెళ్లే శ్రమ లేకుండా ఇంటివద్దకే సేవలను అందించేందుకు వీలవుతుందని తెలిపారు. ఇంట్లోనే ఉచితంగా శాంపిల్ సేకరణతో పాటు డయాగ్నస్టిక్ సర్వీసెస్, మెడిసిన్ డెలివరీ, ట్రాన్సాక్షనల్ నర్సింగ్ కేర్, గాయాలకు డ్రెస్సింగ్, ఇంజెక్షన్, ఫుడ్ ట్యూబ్స్ ఫిక్సింగ్ వంటి సేవలు కాల్‌హెల్త్ అందిస్తుందని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed