- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shilpa Shetty : నా డబ్బుతోనే పోర్న్ వీడియోలు తీశారంటూ.. శిల్పాశెట్టి దంపతులపై కోర్టుకెక్కిన విశాల్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులపై మరో కేసు నమోదయ్యింది. ఇప్పటికే శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. తమను బెదిరించి తమతో పోర్న్ వీడియోలు తీశారని కొంతమంది మోడళ్లు రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేసిన విషయమూ విదితమే. ఈ కేసుల నుంచి బయటపడడానికే శిల్పాశెట్టి దంపతులు సతమతమవుతున్న తరుణంలో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త విశాల్ గోయల్ వీరిపై మరో కేసు పెట్టడం ఇంకా సంచలనంగా మారింది. తన దగ్గర రూ.41 లక్షలు తీసుకొని రాజ్ కుంద్రా దంపతులు తనను మోసం చేశారంటూ విశాల్ పోలీసులను ఆశ్రయించాడు.
ప్రతి ఒక్కరి వద్ద భారీమొత్తంలో డబ్బును తీసుకోని, ఆ డబ్బును పోర్న్ వీడియోలను చిత్రీకరిండానికి ఉపయోగించారని, తన వద్ద రూ.41 లక్షలు తీసుకొని వాటిని కూడా పోర్న్ వీడియోలకే వాడారని ఆయన ఫిర్యాదులో తెలిపాడు. స్వలాభం కోసం చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారని ఇదివరకే విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఈ కేసును పట్టించుకోవడంలేదని ఈసారి ఏకంగా ఢిల్లీ కోర్టునే ఆశ్రయించాడు. దీంతో పోలీసులపై సీరియస్ అయిన మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ మన్ని మాలిక్ ఈ కేసుపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించారు. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 9కు వాయిదా వేశారు. ఇక ఈ కేసులో శిల్పా దంపతులతో పాటు నందన మిశ్రా, దర్శిత్ షా, ఎంకే మధ్వా, సత్యేంద్ర, సరుప్రియ, ఉమేశ్ గోయంక పేర్లు ఉన్నట్లు సమాచారం.