కాంగ్రెస్ పార్టీ పని ఖతం.. వ్యాపారవేత్త సంచలన కామెంట్స్(వీడియో)

by Shyam |   ( Updated:2023-05-19 07:27:24.0  )
Businessman, Congress party
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ‘కాంగ్రెస్ ఖతం హో గయా’.. అంటూ ఓ వ్యాపారవేత్త చేసిన వ్యాఖ్యలు నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పరమ భక్తుడిగా పేరున్న సదరు వ్యాపారి, ‘మన జీవిత కాలంలో ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాదు’ అంటూ వ్యాఖ్యలు చేసిన వీడియో నెట్టింట సంచలనంగా మారడంతో పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇటీవల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో పిచ్చపాటిగా మాట్లాడిన మాటాలే కాంగ్రెస్ నేతలను షాక్‌కు గురిచేస్తున్నాయి. ‘నువ్వు ఇంత పెద్ద కాంగ్రెస్ భక్తుడివి.. మళ్లా మీ సార్ దగ్గరికెళ్లి మాట మార్చవ్ కదా’.. అని ఎంపీ అరవింద్ అడిగినప్పుడు ‘కాంగ్రెస్ ఖతం కావడం వల్లే ఈ గట్టి నిర్ణయం తీసుకున్నాను’ అని సదరు వ్యాపారి చెప్పారు. ‘బ్రహ్మ దేవుడు దిగొచ్చినా వినను. కాంగ్రెస్ ఖతమే’.. అంటూ జోస్యం చెప్తున్న వీడియో వైరల్‌గా మారింది. బీజేపీ నేతలు సదరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా వైరలైంది. కాగా, సదరు వ్యాపారి రాజ్యసభ సభ్యుడు డీఎస్‌కు నమ్మినబంటు అని సమాచారం. ప్రస్తుతం ఎంపీ అర్వింద్ కోటారీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Next Story