మాదాపూర్‌లో వ్యాపారి కిడ్నాప్

by Sumithra |   ( Updated:2020-12-05 05:29:04.0  )
మాదాపూర్‌లో వ్యాపారి కిడ్నాప్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఈ మధ్య వరుసగా జరుగుతున్న కిడ్నాప్‌లు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. ఒక కిడ్నాప్‌ ఘటన మరువకముందే మరో కిడ్నాప్‌ జరిగి కలకలం సృష్టిస్తోంది. దీంతో హైదరాబాద్ నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా శనివారం మాదాపూర్‌లో ఓ వ్యాపారి కిడ్నాప్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ జరిగినట్టు తెలుస్తోంది. ధీరజ్ రెడ్డి అనే వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అయితే భార్యకు సంబంధించిన బంధువులే ధీరజ్‌ రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ కిడ్నాప్‌న‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story