- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
CCI: జోమాటో, స్విగ్గీలపై సీసీఐ విచారణ
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు చట్టాలను ఉల్లంఘించాయనే ఆరోపణలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) విచారణ చేపట్టింది. ఈ కంపెనీలు అవాంఛనీయ వ్యాపార విధానాలు అనుసరిస్తున్నాయని, భాగస్వామ్య రెస్టారెంట్లతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాయని సీసీఐ కనుగొంది. జొమాటో భాగస్వామ్య రెస్టారెంట్లకు తక్కువ కమిషన్ రేట్లకు తన ప్లాట్‌ఫామ్‌లో లిస్టింగ్ చేసిందని, స్విగ్గీ సైతం ఎంపిక చేసిన రెస్టారెంట్లకు వ్యాపార వృద్ధికి హామీ ఇచ్చినట్టు సీసీఐ ఇన్విస్టిగేషన్ విభాగం పేర్కొంది. అయితే, ఈ రకమైన వ్యాపార విధానం ఫుడ్ డెలివరీ మార్కెట్లో న్యాయమైన పోటీకి అడ్డంకిగా మారుతుందని సీసీఐ అభిప్రాయపడింది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు అనుసరిస్తున్న వ్యాపార విధానాలపై నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు ఆధారంగా సీసీఐకి చెందిన యాంటీట్రస్ట్ ఇన్విస్టిగేషన్ విచారణ నిర్వహించింది.