Zomato వినియోగదారులకు షాక్.. ఇకపై ఆ సేవలు బంద్

by Satheesh |   ( Updated:2022-08-22 22:59:55.0  )
Zomato  వినియోగదారులకు షాక్.. ఇకపై ఆ సేవలు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వినియోగదారులకు అందిస్తున్న జోమాటో 'ప్రో', 'ప్రో ప్లస్' మెంబర్ షిప్‌లను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇకపై ఈ మెంబర్ షిప్‌లు కొత్త వినియోగదారులకు అందుబాటులో ఉండవని.. యాక్టివ్‌లో ఉన్న మెంబర్ షిప్‌లు మాత్రం వాటి గడువు తీరే వరకు అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది. గడువు తీరినా ఫ్లాన్‌లను మళ్లీ తిరిగి పునరుద్దరించమని పేర్కొంది. కాగా, జోమాటాలో ప్రో, ప్రో ప్లస్ పేరిట మెంబర్ షిప్ తీసుకున్న వినియోగదారులకు ఫుడ్ డెలివరీలో 30 శాతం వరకు రాయితీ.. వేగవంతమైన డెలివరీ సర్వీస్ వంటి సేవలు అందిస్తుంది. తాజాగా జొమాటో తీసుకున్న నిర్ణయంతో ఇకపై ఆ సేవలు నిలిచిపోనున్నాయి.

వివాదాల్లో Hrithik Roshan జొమాటో యాడ్..

Advertisement

Next Story