- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జొమాటోపై రూ. 8.58 కోట్ల భారీ జీఎస్టీ పెనాల్టీ
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోపై గుజరాత్ రాష్ట్ర పన్నుల విభాగం డిప్యూటీ కమిషనర్ భారీ జరిమానా విధించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీ జీఎస్టీ రిటర్నులు, ఆడిట్ వ్యవహారంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పెనాల్టీ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను అధికంగా పొందినప్పటికీ, తక్కువ జీఎస్టీ చెల్లించిన కారణంగా జొమాటాకు రూ. 4,11,68,604 జీఎస్టీ చెల్లించాలని ఆదేశించినట్టు సమాచారం. ఇది వడ్డీ, జరిమానా కలిపి మొత్తం రూ. 8,57,77,696 కట్టాల్సి ఉందని జొమాండ్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంపై స్పందించిన జొమాటో, దీనికి సంబంధించి అన్ని వివరాలను, సంబంధిత పత్రాలను అందించామని, అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించలేదని అభిప్రాయపడింది. దీనిపై అప్పిలేట్ అధికారుల ముందుకు తీసుకెళ్లనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాతో భాగస్వామ్యం కలిగిన యాంట్‌ఫిన్ సింగపూర్ హోల్డింగ్ జొమాటోలో 2 శాతం వాటాను తగ్గించుకుంది. ఈ నెల మొదటివారంలో రూ. 2,827 కోట్లకు తన వాటాను విక్రయించినట్టు తెలుస్తోంది.