- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పక్షవాతం బారిన పడిన జెరోదా సీఈఓ నితిన్ కామత్
దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ జెరోదా సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ఆరోగ్యం దెబ్బతిన్నది. కొన్ని వారాల క్రితం తనకు పాక్షికంగా పక్షవాతం వచ్చిందని సోమవారం ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. సుమారు 6 వారాలకు ముందు అనుకోకుండా తాను పాక్షికంగా పక్షవాతానికి గురయ్యాను. తండ్రి మరణం, సరిగా నిద్రలేకపోవడం, మానసిక ఒత్తిడి, డీహైడ్రేషన్, ఎక్కువ పని చేయడం వంటి కారణాలతోనే ఆరోగ్య క్షీణించింది. దీనివల్ల తన ముఖం వంకర తిరగడంతో చదవడం, రాయడం కూడా కష్టంగా మారిందని' నితిన్ కామత్ వివరించారు. ప్రస్తుతం కోలుకున్నానని, మరో 3-6 నెలల్లోగా పూర్తిగా నయమవుతుందని తెలిపారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునే తనకే ఇలా జరిగిందని, పని ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను వైద్యులు సూచించారని పేర్కొన్నారు. నితిన్ కామత్ ఆరోగ్యం గురించీ సమాచారం తెలుసుకున్న కొందరు ప్రముఖులు నితిన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.