- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Zerodha: జెరోధా ఈక్విటీ ట్రేడర్లకు గుడ్ న్యూస్..ఇక నుంచి నో బ్రోకరేజీ ఛార్జీ
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్(Trading platform) జెరోధా(Zerodha) పట్ల ఇటీవల కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది.ఈ నేపథ్యంలో ఆ సంస్థ తమ ఈక్విటీ ట్రేడర్ల(Equity Traders)కు అదిరిపోయే శుభవార్త చెప్పింది.ఇక నుంచి ఈక్విటీ డెలివరీ ట్రేడ్(Equity Delivery Trade)లపై ఎటువంటి బ్రోకరేజీ ఛార్జీ(Brokerage Charge)లను విధించబోమని,ఈ సేవలను ఫ్రీగానే కొనసాగించనున్నట్టు తెలిపింది.ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ నితిన్ కామత్(CEO Nitin Kamat) ఓ ప్రకటనలో తెలిపారు.సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (Securities Transaction Tax) 0.0625% నుంచి 0.1% కి పెరుగుతుందన్నారు. అలాగే లావాదేవీల ఛార్జీ 0.0495% నుంచి 0.035%కి తగ్గుతుందని పేర్కొన్నారు.దీని ఫలితంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE)లో సెల్లింగ్ ట్రేడ్‌ల ఖర్చు 0.02303% లేదా రూ.కోటి ప్రీమియంపై 2,303 రూపాయలు పెరుగుతుందన్నారు. అలాగే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE)లో 0.0205% లేదా 2,050 రూపాయలు పెరుగుతుందన్నారు.కాగా జెరోధా దేశంలోనే స్టాక్ బ్రోకరేజ్ యాప్స్(Stock Brokerage Apps)లో రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.