YouTube: యూజర్లకు భారీ షాక్ ఇచ్చిన యూట్యూబ్

by Harish |   ( Updated:2024-08-27 11:30:00.0  )
YouTube: యూజర్లకు భారీ షాక్ ఇచ్చిన యూట్యూబ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. తన ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలను తాజాగా పెంచింది. ఎలాంటి యాడ్‌లు లేకుండా కంటెంట్‌ను చూడటానికి గతంలో తీసుకొచ్చిన ఈ ప్లాన్‌లపై ధరలను భారీగా పెంచింది. వ్యక్తిగత ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌‌కు గతంలో నెలకు రూ.129 ఉండగా, ఇప్పుడు అది రూ.149 కి పెరిగింది. స్టూడెంట్ ప్లాన్ ధర రూ.79 కాగా, దీనిని రూ.89 కి పెంచారు. ముఖ్యంగా ఫ్యామిలీ నెలవారీ ప్లాన్‌‌ ధర మాత్రం 58 శాతం పెరిగింది, గతంలో దీని ధర రూ.189, కాగా, ఇప్పుడు అది రూ. 299 అయింది. ఈ ప్లాన్ ద్వారా కుటుంబంలో ఐదుగురు ప్రయోజనాలు పొందవచ్చు.

అలాగే, నెలకు వ్యక్తిగత ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.159కి చేరింది. ఇంతకుముందు ఇది రూ.139గా ఉంది. ఇంకా వ్యక్తిగత ప్రీపెయిడ్ త్రైమాసిక ప్లాన్ ధర రూ. 399 నుండి రూ. 459కి పెరిగింది. అదే వార్షిక ప్లాన్ ధర రూ. 1,290 నుండి రూ. 1,490కి పెరిగింది. తన ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ ప్రీమియంతో సహా గూగుల్ మొత్తం సబ్‌స్క్రిప్షన్ వ్యాపారం వార్షిక ఆదాయాలలో $15 బిలియన్లను దాటినట్లు సీఈఓ సుందర్ పిచాయ్ జనవరిలో తెలిపారు.

Advertisement

Next Story