యాహూ లో 20 శాతం మంది ఉద్యోగులు ఇంటికి!

by Harish |
యాహూ లో 20 శాతం మంది ఉద్యోగులు ఇంటికి!
X

వాషింగ్టన్: ప్రతి రోజూ వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న టెక్ కంపెనీల జాబితాలో కొత్తగా యాహూ సైతం చేరింది. గత కొంతకాలంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి కారణంతో కంపెనీలు ఉద్యోగులను తీసేస్తుండగా, యాహూ కూడా అదే దారిలో వెళ్తున్నట్లు స్పష్టం చేసింది. కంపెనీ యాడ్ వ్యాపారంలో వ్యూహాత్మక మార్పులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ సీఈఓ జిమ్ లైన్‌జొన్ అన్నారు. మొత్తం ఉద్యోగుల్లో సుమారు 20 శాతం మందిని ఇంటికి పంపనున్నట్లు యాహూ ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రభావితమైన వారిలో ఎక్కువమంది(సగానికి పైగా) యాడ్-టెక్ విభాగానికి చెందినవారే ఉన్నారు. పలు నివేదికల ప్రకారం, కంపెనీ ముందుగా 1,000 మందిని అంటే 12 శాతం మందిని తీసేస్తూ ఉద్యోగులకు వివరాలు తెలియజేసింది. అనంతరం మరో 8 శాతం మందిని కూడా రాబోయే ఆరు నెలల కాలంలో విధుల నుంచి తొలగిస్తామని పేర్కొంది. లాభదాయకత తగ్గిన కంపెనీ అడ్వర్టైజింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే తొలగింపులు జరిగినట్టు జిమ్ లైన్‌జొన్ వెల్లడించారు.

Advertisement

Next Story