బైక్ పై లోన్ తీసుకున్న వ్యక్తి హఠాత్తుగా చనిపోతే .. ప్రతి నెలా EMI ఎవరు పే చేయాలి?

by Jakkula Samataha |
బైక్ పై లోన్ తీసుకున్న వ్యక్తి హఠాత్తుగా చనిపోతే .. ప్రతి నెలా EMI ఎవరు పే చేయాలి?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం బ్యాంకులు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తక్కువ వడ్డీతో బైక్ లోన్, కార్ లోన్ ఇస్తామని ప్రకటిస్తున్నాయి. దీంతో వీటికి ఆకర్షితులైన వారు తమకు నచ్చిన బైక్ తీసుకొని ఈఎంఐ పెట్టుకుంటున్నారు. అయితే లోన్ తీసుకున్న వ్యక్తి ఆకస్మాత్తుగా చనిపోతే మిగిలిన లోన్ ఎవరు కట్టాలి? రుణ గ్రహీత వారసులు కట్టాలా లేక, నామినీదారులు కట్టాలా అని అనేక సందేహాలు వ్యక్తం అవుతుంటాయి. కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే లోన్ ఇచ్చే ముందు ఒక్కో బ్యాంకు నియమాలు ఒక్కో విధంగా ఉంటాయి. హోమ్ లోన్ అయితే ఒక విధంగా, పర్సనల్ లోన్, బైక్ లోన్ అయితే మరో విధంగా ఉంటాయి. ముఖ్యంగా పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా చనిపోయినట్లు అయితే దానికి అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే అది ఆయన వ్యక్తిగత రుణానికి సంబంధించినది కాబట్టి, అతని మరణంతోనే రుణం కూడా ముగుస్తుంది. కానీ వాహనానికి సంబంధించిన లోన్స్ అలా కాదంట. వాహన లోన్ తీసుకున్న వ్యక్తి ఆకస్మాత్తుగా చనిపోతే ఆ మిగిలిన రుణాన్ని అతని బంధువులు చెల్లించాల్సి వస్తుంది. ఒక వేళ వారు చెల్లించాలేమని చెబితే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొని, ఎంత డబ్బుుల అయితే విక్రయించిందో వాటిని తిరిగిపొందుతాయంట. ( నోట్ : ఇది ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది.)

Advertisement

Next Story

Most Viewed