Warren Buffett: షేర్లను విక్రయిస్తున్న ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్

by Harish |   ( Updated:2024-08-03 14:31:29.0  )
Warren Buffett: షేర్లను విక్రయిస్తున్న ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హాత్వే అధిపతి వారెన్‌ బఫెట్‌ రెండవ త్రైమాసికంలో పలు కంపెనీల ఈక్విటీల నుంచి తన షేర్లను విక్రయిస్తున్నారు. జూన్ నుండి $75.5 బిలియన్ల విలువైన స్టాక్‌లను విక్రయించినట్లు కంపెనీ ఆర్థిక నివేదికలు సూచించాయి. ముఖ్యంగా ఎక్కువ వాటాను కలిగిన యాపిల్ కంపెనీలో తనకు ఉన్నటువంటి స్టాక్‌లలో సగానికి పైగా విక్రయించడం గమనార్హం.దీంతో బెర్క్‌షైర్ నగదు నిల్వలు $276.94 బిలియన్లు పెరిగాయని నివేదక తెలిపింది. ఇటీవల కాలంలో యాపిల్ అమ్మకాలు తగ్గడం, చైనాలో వృద్ధి క్షీణించడం కారణంగా బఫెట్ తన పెట్టుబడులను సగానికిపైగా ఉపసంహరించుకున్నారు. యాపిల్ తర్వాత రెండో అతిపెద్ద స్టాక్ హోల్డింగ్ అయిన బ్యాంక్ ఆఫ్ అమెరికాలో కూడా బఫెట్ తన వాటాను 12.15 శాతానికి తగ్గించుకున్నారు. మేలో జరిగిన బెర్క్‌షైర్ వార్షిక సమావేశంలో, బఫెట్ మాట్లాడుతూ, కంపెనీ నగదును పెట్టుబడి పెట్టడంలో ఉన్న ఇబ్బందులను ఎత్తిచూపారు, తక్కువ రిస్క్, అధిక రాబడి సంభావ్యత కలిగిన పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story