Paytm నుండి నిష్క్రమించిన వారెన్ బఫెట్

by Harish |
Paytm నుండి నిష్క్రమించిన వారెన్ బఫెట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ Paytm(One 97 కమ్యూనికేషన్స్) నుండి వారెన్ బఫెట్ ఆధ్వర్యంలోని బెర్క్‌షైర్ హాత్వే నిష్క్రమించింది. కంపెనీలో ఉన్న 2.46 వాటాను విక్రయించింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.1,371 కోట్లు అని తెలుస్తుంది. Paytm మాతృసంస్థ One 97 కమ్యూనికేషన్స్‌లో బెర్క్‌షైర్ హాత్వే దాదాపు 15.6 మిలియన్ల షేర్ల(2.46 శాతం)ను కలిగి ఉంది. ఈ మొత్తాన్ని కూడా ఇప్పుడు విక్రయించింది. సగటున ఒక్కో షేర్ ధరను రూ. 877.29 వద్ద విక్రయించగా, ఈ డీల్ ద్వారా బెర్క్‌షైర్ దాదాపు రూ.1,371 కోట్లు సంపాదించినట్లయింది.

బెర్క్‌షైర్ హాత్వే సెప్టెంబర్ 2018లో రూ.2,179 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. ఆ తర్వాత IPO సమయంలో రూ. 301.70 కోట్ల విలువైన షేర్లను ఒక్కో షేరుకు రూ. 2,150 చొప్పున విక్రయించింది. ఇప్పుడు మిగిలిన షేర్లను కూడా విక్రయించడం ద్వారా మొత్తం Paytmలో తన పెట్టుబడి నుండి రూ. 1,672.7 కోట్లను తిరిగి సంపాదించింది. దీంతో తన పెట్టుబడిపై దాదాపు రూ.507 కోట్ల నష్టాన్ని వారెన్ బఫెట్ సంస్థ చవిచూసింది.

Next Story

Most Viewed