Waaree Energies: ఈ నెల 21 నుంచి వారీ ఎనర్జీస్ ఐపీఓ ప్రారంభం.. ఒక్కో షేరు ధర ఎంతంటే..?

by Maddikunta Saikiran |
Waaree Energies: ఈ నెల 21 నుంచి వారీ ఎనర్జీస్ ఐపీఓ ప్రారంభం.. ఒక్కో షేరు ధర ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లోకి ప్రవేశించేందుకు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పబ్లిక్ ఇష్యూల కోసం సంస్థలు లైన్ కడుతున్నాయి. తాజాగా సోలార్ ప్యానెల్ తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్(Waaree Energies) కూడా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి వచ్చింది. మార్కెట్ల నుంచి ఐపీఓ షేర్ల ద్వారా సుమారు రూ. 4,321 కోట్లను సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూకు రెడీ అయ్యింది. ఇందుకు సంబంధించిన సబ్‌స్క్రిప్షన్‌ అక్టోబర్ 21న ప్రారంభమై 23న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు అక్టోబర్ 18నే బిడ్డింగ్ విండో తేర్చుకోనుంది. ఒక్కో షేర్ ధర రూ. 1427-రూ. 1503గా కంపెనీ ఖరారు చేసింది. 9 షేర్లను కలిపి ఒక్కో లాట్ గా నిర్ణయించారు. ఒక్కో లాట్ కొనుగోలు చేయాలంటే దాదాపు రూ. 13,527 చెల్లించాల్సి ఉంటుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 721.44 కోట్ల విలువైన మరో 48 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ విక్రయించనుంది. కాగా వారీ ఎనర్జీస్ కు సూరత్(Surat), నందిగ్రామ్(Nandigram), చిఖ్లీ(Chikhli), నోయిడా(Noida)లో ఐదు తయారీ యూనిట్లు ఉన్నాయి. మన దేశంలో సోలార్ ఎనర్జీ ఇండస్ట్రీలో వారీ ఎనర్జీస్ ఒకటిగా పేరు పొందింది.

Advertisement

Next Story