- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 8 వేల కోట్ల సమీకరణ కోసం ఐపీఓకు విశాల్ మెగా మార్ట్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ బడ్జెట్ సూపర్ మార్కెట్ చెయిన్ విశాల్ మెగా మార్ట్ త్వరలో ఐపీఓకు రానుంది. మార్కెట్ల నుంచి 1 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 8,280 కోట్ల) వరకు నిధులను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. విశాల్ మెగా మార్ట్ విలువ 5 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. నిధుల సేకరణ తర్వాత వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని మరిన్ని స్టోర్ల ఏర్పాటు కోసం కేటాయించాలని కంపెనీ ప్రణాళికలు కలిగి ఉంది. విశాల్ మెగా మార్ట్‌లో మెజారిటీ వాటాను ఉన్న స్విట్జర్లాండ్‌కు చెందిన పార్టనర్స్ గ్రూప్, భారత్‌కు చెందిన కేదారా కేపిటల్ ఈ ఐపీఓ కోసం తమ వాటాలను విక్రయించనున్నట్టు రాయిటర్స్ తన నివేదిక పేర్కొంది. ప్రస్తుతానికి ఇరు సంస్థలు విశాల్ మెగా మార్ట్‌లో ఎంత వాటా విక్రయించాలి అనే దానిపై ఇంకా స్పష్టతకు రాలేదు. పార్ట్‌నర్స్ గ్రూప్, కేదారా విశాల్ మెగా మార్ట్‌ను 2018లో టీపీజీ, శ్రీరామ్ గ్రూప్ నుంచి దాదాపు రూ. 2,900 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సూపర్ మార్కెట్ చిన్న నగరాల్లో తన స్టోర్లను కలిగి ఉంది. బట్టలు, కిరాణా సరుకులను విక్రయించే విశాల్ మెగా మార్ట్ 560 స్టోర్లను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఐపీఓ కోసం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులను కోరినట్టు సమాచారం. ఈ ఏడాది ఆఖరు నాటికి పబ్లిక్ ఇష్యూకు రావొచ్చని అంచనా.