Celebrity Tax Payers: భారీ మొత్తం పన్ను కట్టిన విరాట్ కొహ్లీ

by S Gopi |
Celebrity Tax Payers: భారీ మొత్తం పన్ను కట్టిన విరాట్ కొహ్లీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ(Virat Kohli )అత్యధికంగా పన్ను చెల్లించిన క్రీడాకారుడిగా నిలిచారు. ఫార్చ్యూన్ ఇండియా తాజా జాబితా ప్రకారం.. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరానికి కొహ్లీ రూ. 66 కోట్ల పన్ను ప్రభుత్వానికి చెల్లించారు. ఫార్చ్యూన్ డేటాలో భారత సెలబ్రిటీల్లో అత్యధికంగా పన్ను చెల్లించిన వారిలో షారుఖ్ ఖాన్ అందరికంటే ఎక్కువగా రూ. 92 కోట్ల పన్ను కట్టగా, ఆ తర్వాత తమిళ నటుడు విజయ్ సేతుపతి రూ. 80 కోట్లు, సల్మాన్ ఖాన్ రూ. 75 కోట్లు, అమితాబ్ బచ్చన్ రూ. 71 కోట్ల పన్ను చెల్లించారు. మాజీ టీమిండియా క్రికెటర్లలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(DHONI) రూ. 38 కోట్లు, సచిన్ టెండుల్కర్ రూ. 28 కోట్లతో అత్యధిక సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారుల జాబితాలో ఉన్నారు. క్రికెట్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రూ. 13 కోట్లు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ రూ. 10 కోట్లతో అధిక పన్ను చెల్లించిన వారిలో ఉన్నారు. ఫార్చ్యూన్(FORTUNE) ఇండియా జాబితాలో క్రికెటర్, బీసీసీఐ(BCCI) ప్రెసిడెంట్‌గా ఉన్న సౌరభ్ గంగూలీ కూడా రూ. 23 కోట్ల పన్ను చెల్లింపుతో లిస్ట్‌లో ఉన్నారు. అధిక పన్నులు చెల్లిస్తున్న సెలబ్రిటీల్లో అజయ్ దేవగన్(రూ. 42 కోట్లు), రణబీర్ కపూర్(రూ. 36 కోట్లు), హృతిక్ రోషన్(రూ. 28 కోట్లు), కపిల్ శర్మ(రూ. 26 కోట్లు), కరీనా కపూర్( రూ. 20 కోట్లు), షాహిద్ కపూర్(రూ. 14 కోట్లు), మోహన్‌లాల్(రూ. 14 కోట్లు), అల్లు అర్జున్(రూ. 14 కోట్లు), కియారా అద్వానీ(రూ. 12 కోట్లు), కత్రినా కైఫ్(రూ. 11 కోట్లు), పంకజ్ త్రిపాఠి(రూ. 11 కోట్లు), అమీర్ ఖాన్(రూ. 10 కోట్లు), రిషబ్ పంత్( రూ. 10 కోట్లు) ఉన్నారు.

Advertisement

Next Story