IDBI: ముందుకు కదలనున్న ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ

by S Gopi |   ( Updated:2024-07-18 12:25:49.0  )
IDBI: ముందుకు కదలనున్న ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ఎప్పటినుంచో ఆలస్యమవుతూ వస్తోంది. అనేక సవాళ్ల మధ్య గతేడాది ఆసక్తి వ్యక్తీకరణ ప్రక్రియ (ఈఓఐ) పూర్తిచేసుకొని తర్వాతి దశకు చేరుకుంది. ఐడీబీఐ బ్యాంక్ కోసం బిడ్డర్లు రెగ్యులేటరీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారో లేదో అంచనా వేసేందుకు ఉద్దేశించిన ఆర్‌బీఐ నివేదిక ప్రభుత్వానికి అందించింది. ఈ క్రమంలో దీని తర్వాత పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఈ నెల 23న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో పరిశీలించవచ్చని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే గనక జరిగితే సుధీర్ఘకాలంగా కొనసాగుతున్న ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ కీలకు దశకు చేరుకుంటుంది. బిడ్డర్ల ప్రమాణాల అంచనాలకు అవసరమైన ఆర్‌బీఐ నివేదికలో ఒక బిడ్డర్ మినహా అందరికీ క్లియర్ చేసింది. కాబట్టి తదుపరి ప్రక్రియ జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని వర్గాలు పేర్కొన్నాయి. ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ, ప్రభుత్వానికి కలిపి మొత్తం 94.72 శాతం వాటా ఉంది. అందులో 61 శాతం వాటాను విక్రయించడమే కాకుండా యాజమాన్య హక్కును కూడా బదిలీ చేసేందుకు కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed