- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ పథకాల్లో మహిళలకు అదిరిపోయే బెనిఫిట్స్
దిశ, వెబ్‌డెస్క్: మహిళల కోసం చాలా రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వారిని నిరంతరం అభివృద్ధి పథంలోకి నడిపించడానికి కేంద్రంతో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రత్యేకమైన పథకాలను అందిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ కొత్తగా నాలుగు పథకాలను తీసుకొచ్చింది.
ఇవి మహిళల కోసం మాత్రమే ఉద్దేశించినవి. మహిళలను పారిశ్రామికవేత్తలుగా, నిపుణులుగా మార్చడానికి ఇవి సహాయపడతాయి. అవి యూనియన్ ఉన్నతి, యూనియన్ సమృద్ధి, యూనియన్ సమ్మాన్, యూనియన్ SBCHS. ఇవి ఒక్కోరకమైన ప్రత్యేక అభివృద్ధి ప్రయోజనాలు అందిస్తాయి.
యూనియన్ ఉన్నతి: ఈ పథకం మహిళా వ్యాపారవేత్తలు, నిపుణుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన కరెంట్ ఖాతా. దీనిలో వ్యక్తిగత ప్రమాద బీమా, ఉచిత క్యాన్సర్ కేర్ కవరేజ్, రుణాల వడ్డీ రేట్లలో రాయితీ, తక్కువ కనీస సేవా, ప్రాసెసింగ్ చార్జీలు ఉంటాయి.
యూనియన్ సమృద్ధి: దీనిలో మహిళలకు సురక్షితమైన, అనుకూలమైన పొదుపులు, ఆర్థిక నిర్వహణ సౌకర్యాలు లభిస్తాయి. ఇది మహిళలను శక్తివంతం చేయడానికి రూపొందించబడింది. అలాగే, యూనియన్ ఉన్నతి ప్రయోజనాలను కూడా దీనిలో ఉంటాయి.
యూనియన్ సమ్మాన్: ఇది ప్రత్యేకంగా పెన్షనర్ల కోసం తీసుకొచ్చిన పొదుపు పథకం. దీనిలో ఖాతాదారులకు డోర్-స్టెప్ బ్యాంకింగ్, వ్యక్తిగత ప్రమాద బీమా, తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ చార్జీలలో రాయితీ, ఫ్రీ హెల్త్ చెకప్స్ ఉంటాయి.
యూనియన్ SBCHS: ఈ పథకం మహిళా సహకార హౌసింగ్ సొసైటీలకు ఉపయోగపడుతుంది. దీంతో మహిళలకు సోలార్ లైట్లు, ఎలివేటర్లు, ఇతర యంత్రాల కొనుగోలు కోసం లోన్ ప్రాసెసింగ్ చార్జీలలో రాయితీలు, హౌసింగ్ సొసైటీ, ఫ్లాట్ యజమానుల కోసం ఇల్లు, వాహనం, విద్యా రుణాల్లో వడ్డీ రేట్లలో రాయితీ లభిస్తుంది.