- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లాభంలో 93 శాతం వృద్ధిని నమోదు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ముంబై: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో స్టాండ్ లోన్ నికర లాభంలో 93.27 శాతం వృద్ధితో మొత్తం రూ. 2,782 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో 1,440 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 21.88 శాతం వృద్ధితో రూ. 8,251 కోట్లుగా ఉంది. బ్యాంక్ ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. స్థూల NPA మొత్తం అడ్వాన్సులు ఏడాది ప్రాతిపదికన 7.53 శాతం, నికర NPA 1.70 శాతానికి తగ్గాయి.
బ్యాంక్ మొత్తం వ్యాపారం సంవత్సరానికి 10.23 శాతం పెరిగింది, ఇందులో స్థూల అడ్వాన్సులు 13.05 శాతం వృద్ధితో రూ. 8.09 ట్రిలియన్లకు, మొత్తం డిపాజిట్లు సంవత్సరానికి 8.26 శాతం పెరిగి రూ.11.17 ట్రిలియన్‌లకు చేరుకున్నాయి. మార్చి 31, 2023 నాటికి బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.19,27,621 కోట్లుగా ఉంది. మార్చి 31, 2023 తో ముగిసిన సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.3 డివిడెండ్ ఇవ్వాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించినట్లు బ్యాంక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది.
Also Read: