- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Unemployment: జూలైలో తగ్గిన నిరుద్యోగిత రేటు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఏడాది జూలైలో దేశంలో నిరుద్యోగ రేటు స్వల్పంగా తగ్గింది. అంతకుముందు నెలలో ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయికి చేరిన నిరుద్యోగ రేటు గత నెలలో దిగొచ్చింది. సీఎంఐఈ కన్స్యూమర్ పిరమిడ్స్ హౌస్‌హోల్డ్ సర్వే ప్రకారం, జూన్‌లో 9.2 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూలైలో 7.9 శాతానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో విత్తే కాలం మొదలవడం, కార్మికుల నియామకంలో పురోగతి కారణంగా నిరుద్యోగ రేటులో క్షీణత నమోదైందని నిపుణులు అభిప్రాయపడ్డారు. మొత్తం నిరుద్యోగుల్ సంఖ్య జూలైలో 4.14 కోట్ల నుంచి 3.54 కోట్లకు తగ్గింది. సమీక్షించిన నెలలో గ్రామీణ ప్రాంతంలో 7.5 శాతం, పట్టణ ప్రాంతాల్లో 8.5 శాతంగా నిరుద్యోగ రేటు ఉంది. నెల వ్యవధిలో పట్టణ ప్రాంతాల్లో 0.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 1.8 శాతం క్షీణత నిరుద్యోగ రేటు తగ్గింది. ఈ డేటా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ క్షీణత కొంత ఉపశమనాన్ని సూచిస్తున్నాయి. అయితే, ప్రైవేట్ రంగంలో నియామకాలు పెరిగేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు గండి కొడుతూ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ తరుగుదల నెమ్మదిగా ఉందని నిపుణులు వివరించారు. రుతుపవనాల ఆలస్యంతో జూలైలో వ్యవసాయం రంగం ఎక్కువ నియామకాలను చేపట్టిందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ చెప్పారు.