- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్‌లో తీవ్రస్థాయిలో నిరుద్యోగం.. వారిలో 83 శాతం మంది యువతే: నివేదిక
దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశంలో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉంది. ముఖ్యంగా నిరుద్యోగుల్లో ఎక్కువ శాతం యువతే ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని ఒక నివేదిక పేర్కొంది. నిరుద్యోగుల జాబితాలో 34 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన 83 శాతం యువత ఉద్యోగాల కొరతను ఎదుర్కొంటున్నారని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (IHD) ప్రచురించిన ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024 డేటా పేర్కొంది. మొత్తం నిరుద్యోగ యువతలో కనీసం సెకండరీ విద్యను కలిగి ఉన్న విద్యావంతులైన యువకుల నిష్పత్తి 2000లో 35.2 శాతం నుండి 2022 నాటికి 65.7 శాతానికి దాదాపు రెట్టింపు కావడం ఆందోళనకరంగా ఉందని నివేదిక హైలెట్ చేసింది.
గత కొన్నేళ్లుగా భారత్‌లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి, అయితే ఉద్యోగాలు దొరకక చదువుకున్న యువత చాలా కష్టపడుతున్నారు. దేశ యువతకు సరైన ఉద్యోగాలు లేకపోవడం వలన నిరుద్యోగ స్థాయి అంతకంతకూ పెరుగుతోంది. గత 22 సంవత్సరాల్లో విద్యావంతులైన నిరుద్యోగిత రేటు పెరిగింది. నివేదిక పేర్కొన్న దాని ప్రకారం, 2022లో సెకండరీ విద్య లేదా అంతకంటే ఎక్కువ చదివిన యువతలో నిరుద్యోగం ఆరు రెట్లు ఎక్కువగా ఉంది.
సెకండరీ విద్య తర్వాత డ్రాపౌట్ రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా పేద రాష్ట్రాలు, అట్టడుగు వర్గాల్లో ఇది కనిపిస్తుంది. ఉన్నత విద్యలో నమోదు పెరుగుతున్నప్పటికీ, చదువు నాణ్యత ఆందోళనలు కలిగిస్తుందని నివేదిక అభిప్రాయ పడింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరుద్యోగ రేట్లలో గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆశాజనకంగా ఉద్యోగ కల్పన చేస్తుండగా, ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో, యువత ఉపాధిలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
2021లో మొత్తం జనాభాలో 27 శాతం ఉన్న యువత జనాభా 2036 నాటికి 23 శాతానికి తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగాల కొరత తీవ్రంగా కనిపించింది. 2015–16, 2019 మధ్యకాలంలో 10 మిలియన్లకు పైగా ఉద్యోగార్ధులు నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో నమోదు చేసుకోగా, వారిలో 64 శాతం మంది పురుషులు, 83 శాతం మంది 15-34 సంవత్సరాల వయస్సు గల యువకులు అని నివేదిక పేర్కొంది. దేశంలో నిరుద్యోగ కట్టడికి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, యువతే దేశానికి బలం కాబట్టి వారికి మరిన్ని ఉద్యోగవకాశాలను అందించాలని నిపుణులు పేర్కొంటున్నారు.