రూ. 94,999 ధరతో ఐక్యూబ్ కొత్త వేరియంట్‌ను విడుదల చేసిన టీవీఎస్

by S Gopi |
రూ. 94,999 ధరతో ఐక్యూబ్ కొత్త వేరియంట్‌ను విడుదల చేసిన టీవీఎస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఈవీ పోర్ట్‌ఫోలియోలో ఐక్యూబ్ మోడల్ కొత్త వేరియంట్‌ను సోమవారం విడుదల చేసింది. 2.2 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వచ్చిన ఈ స్కూటర్ ధరను రూ. 94,999(ఎక్స్‌షోరూమ్) నిర్ణయించామని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 75 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంటుందని, ఇందులో 950వాట్ల ఛార్జర్ ఉంటుందని, కేవలం 2 గంటల్లో 0-80 శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ వివరించింది. ఇక, కొత్త వేరియంట్‌లో 5-అంగుళాల కలర్ టీఎఫ్‌టీ స్క్రీన్, వెహికల్ క్రాష్, టో అలర్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, డిస్టెన్స్ టూ ఎంప్టీ, 30 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్‌తో వస్తుంది. ఈ స్కూటర్ వాల్‌నట్ బ్రౌన్, పియర్ల్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. కొత్త వేరియంట్ విడుదలతో ఐక్యూబ్ మోడల్‌లో 3.4 కిలోవాట్ అవర్, 5.1 కిలోవాట్ అవర్ సహా మూడు వేరియంట్లు వినియోగదారులకు ఉంటాయని టీవీఎస్ పేర్కొంది.

Advertisement

Next Story