- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TVS Jupiter 110: సరికొత్త ఫీచర్లతో రూ.73 వేలకే TVS జూపిటర్ 110
దిశ, బిజినెస్ బ్యూరో: TVS మోటార్ కంపెనీ మార్కెట్లోకి గురువారం సరికొత్త జూపిటర్ 110ని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.73,700 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది నాలుగు వేరియంట్‌లలో లభిస్తుంది, అవి.. డ్రమ్, డ్రమ్ అల్లాయ్, డ్రమ్ ఎస్‌ఎక్స్‌సీ, డిస్క్ ఎస్‌ఎక్స్‌సీ. పాత వాటితో దీనిలో అదిరిపోయే కొత్త ఫీచర్లను అందించారు. ఇంజన్ కెపాసిటీ 113.3 cc, సింగిల్ సిలిండర్. ఇది 6500 rpm వద్ద గరిష్టంగా 7.9 bhp శక్తిని,5.000 rpm వద్ద 9.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
TVS జూపిటర్ 110 ఫీచర్లు: దీని సీటు క్రింద ఎక్కువ స్పేస్‌ను అందించారు. దీనిలో రెండు హాఫ్-ఫేస్ హెల్మెట్‌లను పెట్టుకోవచ్చు. సామర్థ్యం 33-లీటర్లు. ఎమర్జెన్సీ బ్రేక్ ఇండికేటర్, మలుపుల వద్ద ఇండికేటర్‌ను ఆఫ్ చేయడం మర్చిపోయినట్లయితే 20 సెకన్ల తర్వాత ఆటో మెటిక్‌గా ఆఫ్ అయ్యే ఫీచర్, ఫైండ్ మై స్కూటర్, స్కూటీని ఆఫ్ చేసిన తర్వాత కూడా చీకట్లో నడుచుకుంటూ వెళ్లేందుకు కొద్ది సేపు లైట్ ఆఫ్ కాకుండా ఉండటానికి ఫాలో మీ హెడ్‌ల్యాంప్ అనే కొత్త ఆప్షన్‌ను దీనిలో అందించారు.
పార్కింగ్ బ్రేక్, వాయిస్ ఆధారిత నావిగేషన్, ప్రస్తుతం ఉన్న పెట్రోల్‌తో ప్రయాణించే దూరం, వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు అవతలి వారిని అప్రమత్తం చేసేలా హజార్డ్ ల్యాంప్స్, సిగ్నళ్ల దగ్గర ఆటోమెటిక్‌గా ఆఫ్ అయ్యే iGo అసిస్ట్, మొబైల్ చార్జింగ్ పోర్ట్, స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ కనెక్టివిటీ, LCD డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు, టాప్ వేరియంట్ కోసం 220 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనుకవైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్‌ను అందించారు.