కొడుకు పెళ్లి ఖర్చు ప్రజలపై వేస్తున్నావా అంబానీ అని నెట్టింట ట్రోల్స్.. కారణం ఏంటంటే!

by Hamsa |
కొడుకు పెళ్లి ఖర్చు ప్రజలపై వేస్తున్నావా అంబానీ అని నెట్టింట ట్రోల్స్.. కారణం ఏంటంటే!
X

దిశ, ఫీచర్స్: అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట తొందరలో పెళ్లి జరగబోతున్న సంగతి తెలిసిందే. ఆయన చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహం రాధి మర్చంట్‌తో జూలై 12న అంగరంగ వైభవంగా జరగబోతోంది. అయితే ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు రెండుసార్లు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సంబరాలకు సినీ సెలబ్రిటీలంతా హాజరై సందడి చేశారు.

అలాగే ఇటీవల వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ అవడంతో అందరికీ పత్రిక ఇచ్చి పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో.. ముఖేష్ అంబానీ జియో రీఛార్జ్ ధరలను భారీగా పెంచి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. జియో వినియోగదారులు మరీ దారుణంగా పోస్టులు పెడుతూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. కొడుకు పెళ్లి ఖర్చును మొత్తానికి ప్లాన్ చేసి మరీ దేశ ప్రజల నెత్తిన పడేస్తున్నావా అంబానీ మావా అని అంటున్నారు. అలాగే జియో సిగ్నల్ కూడా సరిగ్గా రావడం లేదని మండిపడుతున్నారు.

Next Story

Most Viewed