Trending: మొబైల్ లవర్స్‌కు భారీ గుడ్‌న్యూస్.. ఐఫోన్ 16 సిరీస్ ధరలు లీక్!

by Shiva |   ( Updated:2024-08-23 05:33:05.0  )
Trending: మొబైల్ లవర్స్‌కు భారీ గుడ్‌న్యూస్.. ఐఫోన్ 16 సిరీస్ ధరలు లీక్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐఫోన్.. యువతకు అదొక డ్రీమ్. ఏనాటికైనా జీవితంలో ఒక్కసారైనా ఆ ఫోన్ వాడాలని కోరుకుంటారు. ఇటీవల కాలంలో యాపిల్ కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తుంది. సంవత్సరానికి ఒకసారి కొత్త ఐఫోన్ మోడళ్లను ప్రవేశపెడుతూ అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా యాపిల్ ఐఫోన్-16 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను గ్లోబల్ మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతోంది. అందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అనే నాలుగు రకాల మోడల్స్ ఉన్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఆ ఫోన్లను వాడినట్లుగా కంపెనీ తెలిపింది. ఇక ధరల విషయానికి వస్తే.. ఐఫోన్ 16 బేస్ మోడల్ ధర (128 GB) రూ.67,100, 16 ప్లస్ రూ.75,500, 16 ప్రో మ్యాక్స్ రూ.1,00,700లుగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక ఐఫోన్ 16, 16 ప్లస్ మోడల్ ఫోన్లు యాపిల్ A18 చిప్ సెట్‌తో రాబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంటెలిజెన్స్ ఫీచర్స్, ఐఫోన్ 15 సిరీస్‌తో కంపేర్ చేస్తే 16 మోడల్ డిస్‌ప్లే సైజ్ 0.2 అంగుళాలు పెద్దగా ఉండనుంది. బ్యాటరీ సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. 16 మోడల్ సిరీస్ యాపిల్ వచ్చే నెలలో విడుదల చేసేందుక ప్లాన్ చేస్తోంది.

Advertisement

Next Story