పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి PF ఖాతాను ఇలా ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేయండి!

by Harish |   ( Updated:2023-02-13 06:03:05.0  )
పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి PF ఖాతాను ఇలా ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేయండి!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగులకు సేవింగ్స్ పరంగా అతి ముఖ్యమైనది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPF). ఇది వివిధ రకాల ఉద్యోగస్తులకు ఆర్థిక పరంగా ప్రయోజనాలు పొందేందుకు ఒక సామాజిక భద్రతా పథకం. కంపెనీలు తమ ఉద్యోగుల భద్రతకు సంబంధించి పదవీ విరమణ తర్వాత లేదా ఏదైనా ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉండటానికి ప్రతినెలా కొంత అమౌంట్‌ను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌లో జమ చేయడం జరుగుతుంది.

అయితే ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి ఉద్యోగం మారినప్పుడు మళ్లీ కొత్తగా EPF ఖాతాను ఓపెన్ చేయకుండా, పాత ఖాతాను కొత్త కంపెనీకి మార్చవచ్చు. దీని ద్వారా కొత్త కంపెనీకి మారిన తరువాత కూడా పాత అకౌంట్‌కు సంబంధించిన ఖాతాలో అమౌంట్ జమ అవుతుంది. అంతేకాకుండా ఉద్యోగాలు మారిన ప్రతిసారి కొత్తగా EPF ఖాతాను ఓపెన్ చేయాల్సి బాధ ఉండదు. దీనికోసం ముందుగా మీరు PF ఖాతా ట్రాన్స్‌ఫర్ కోసం పాత కంపెనీ, కొత్త కంపెనీ నుంచి అనుమతి పొందాలి. మరి EPF ఖాతాను పాత నుండి కొత్త కంపెనీకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో ఒకసారి చూద్దాం..

* ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పోర్టల్‌‌లో లాగిన్ కావాలి.

* UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్), పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి.

* 'ఆన్‌లైన్ సర్వీసెస్' ట్యాబ్‌లో 'One Member – One EPF Account (Transfer Request)'ను ఎంచుకోవాలి.

* EPF ఖాతాను ఏ కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేయాలో వాటి వివరాలను నమోదు చేయాలి.

* పాత కంపెనీ లేదా కొత్త కంపెనీకి PF ఖాతా ట్రాన్స్‌ఫర్ కోసం వారి అనుమతిని నమోదు చేయాలి.

* తరువాత UAN, EPF ఖాతా నంబర్‌ను నమోదు చేయాలి.

* రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేశాక, సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.

* తరువాత అప్లికేషన్‌కు సంబంధించిన ఫారమ్‌ను PDF ఫార్మాట్‌లో కొత్త కంపెనికి సబ్మిట్ చేయాలి.

* వారి నుంచి అనుమతి రావడానికి సాధరణంగా 30-45 రోజులు పడుతుంది.

* EPFO పోర్టల్‌లో ట్రాకింగ్ ID ద్వారా అప్లికేషన్‌ను ట్రాక్ చేయవచ్చు.

Advertisement

Next Story