Trafik Sol IPO: సెబీ కీలక నిర్ణయం.. ట్రాఫిక్ సోల్ ఐటీఎస్ టెక్నాలజీస్ ఐపీఓ రద్దు..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-03 14:49:56.0  )
Trafik Sol IPO: సెబీ కీలక నిర్ణయం.. ట్రాఫిక్ సోల్ ఐటీఎస్ టెక్నాలజీస్ ఐపీఓ రద్దు..!
X

దిశ, వెబ్‌డెస్క్: స్టాక్ మార్కెట్ల(Stock Market) నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(SEBI) కీలక నిర్ణయం తీసుకుంది. నోయిడా(Noida)కు చెందిన ఎస్ఎంఈ(SME) బోర్డు కంపెనీ ట్రాఫిక్ సోల్ ఐటీఎస్ టెక్నాలజీస్(Trafik Sol ITS Technologies) ఐపీఓ(IPO)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ సంస్థపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఐపీఓలో షేర్లు అలాట్ అయిన మదుపర్ల(Investors)కు డబ్బును రీఫండ్(Refund) చేయాలని, ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని బాంబే స్టాక్ ఎక్ఛేంజ్(BSE)కి సూచించింది. దీంతో ఇన్వెస్టర్ల డబ్బును కంపెనీ డీమ్యాట్ అకౌంట్(Demat Account)కు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ట్రాఫిక్ సోల్ సంస్థ రూ. 45 కోట్ల నిధుల సమీకరించాలనే లక్ష్యంతో ఐపీఓకు ఎంట్రీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియ(Bidding Process) సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు కొనసాగింది. ఒక్కో షేరు ధరను రూ. 66-77గా నిర్ణయించగా మొత్తం 345. 65 రేట్ల సబ్ స్క్రిప్షన్(Subscription) అందుకుంది.

Advertisement

Next Story

Most Viewed