- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక మలేషియాతో మన రూపాయల్లోనే వ్యాపారం..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భారత కరెన్సీకి మరింత ఆదరణ పెరిగే అవకాశం కలిగింది. ఇక మీదట భారత్-మలేషియా మధ్య వాణిజ్య చెల్లింపులు చేయడానికి రూపాయిని ఉపయోగించవచ్చని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఇంతకుముందు ఈ జాబితాలో మారిషస్, శ్రీలంక, రష్యాలు ఉండగా, ఇప్పుడు కొత్తగా మలేషియా చేరింది.
ఈ దేశాలతో ఎగుమతులు, దిగుమతులకు చెల్లింపులు చేసేటప్పుడు ఇతర కరెన్సీలతో పాటు, భారత రూపాయిని కూడా ఉపయోగించవచ్చు. ఇంతకుముందు జులై 2022 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయంగా వాణిజ్యానికి సంబంధించి చెల్లింపులను రూపాయిల్లో చేయడానికి అనుమతించింది.
ఈ నిర్ణయంతో భారత్-మలేషియా మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడంతో పాటు, ఇప్పటి నుంచి ఇన్‌వాయిసింగ్ చెల్లింపులు, సెటిల్‌మెంట్‌లు రూపాయిల్లో జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే, గ్లోబల్ ట్రెడింగ్‌కు ఇది మరింత ఉపయోగపడతుందని తెలిపింది.
మలేషియాతో రూపాయిల్లో చెల్లింపుల కోసం, "కౌలాలంపూర్‌లో ఉన్న ఇండియా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ మలేషియా (IIBM), భారత్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయిన దాని సంబంధిత బ్యాంకు ద్వారా ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతాలను అందుబాటులోకి తెచ్చారు.
Also Read..