ఈ ఏడాదిలోనే అత్యల్పంగా ట్రాక్టర్ అమ్మకాలు!

by Vinod kumar |
ఈ ఏడాదిలోనే అత్యల్పంగా ట్రాక్టర్ అమ్మకాలు!
X

ముంబై: దేశీయంగా ట్రాక్టర్ అమ్మకాలు ఈ ఏడాదిలోనే అత్యల్పంగా నమోదయ్యాయి. నెలవారీగా కూడా క్షీణించాయి. అయితే, గతేడాదితో పోలిస్తే విక్రయాలు స్వల్పంగా పెరిగాయి. ఎగుమతులు మెరుగుపడగా, మొత్తం ట్రాక్టర్ల తయారీ 11 నెలల గరిష్ఠానికి చేరుకుంది. తాజా ట్రాక్టర్ అండ్ మెకనైజేషన్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం, గత నెలలో మొత్తం 53,259 యూనిట్ల అమ్మకాలు జరగ్గా, 2022, ఆగష్టులో 52,691 ట్రాక్టర్ల అమ్మకాలు నమోదయ్యాయి.

ముఖ్యంగా దేశంలో ఋతుపవనాల ప్రభావంతోనే ట్రాక్టర్ అమ్మకాల డిమాండ్‌పై ప్రభావం ఉందని అసోసియేషన్ తెలిపింది. నెలవారీగా చూస్తే, 2023, జూలైలో 58,582 యూనిట్ల ట్రాక్టర్ల అమ్మకాలతో పోలిస్తే 9 శాతం తగ్గాయి. దిగ్గజ మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో 3 శాతం వృద్ధిని, ఎస్కార్ట్స్ కుబోటా అమ్మకాలు 2 శాతం క్షీణించాయి.

Advertisement

Next Story

Most Viewed