Today Gas Rates: ఆగస్టు 2: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Kavitha |
Today Gas Rates: ఆగస్టు 2: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, ఫీచర్స్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. ప్రతి నెలా 1 వ తారీకు రాగానే ధరలు తగ్గుముఖం పడతాయోమోనని సామాన్య ప్రజలు కొండంత ఆశతో ఎదురు చూస్తారు. కానీ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో వారికి నిరాశే మిగులుతుంది.

ఇక నిన్న 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై 7.50 రూపాయలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటన చేశాయి. పెరిగిన ధరలు నిన్నటి నుంచి అంటే ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కానీ గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో సామాన్య ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్: రూ 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 912

విజయవాడ: రూ. 927

గుంటూరు: రూ. 944

Advertisement

Next Story

Most Viewed