మీ క్రెడిట్ కార్డు అప్పు తీర్చలేకపోతున్నారా.. ఈ టిప్స్ పాటించండి!

by Jakkula Samataha |
మీ క్రెడిట్ కార్డు అప్పు తీర్చలేకపోతున్నారా.. ఈ టిప్స్ పాటించండి!
X

దిశ, ఫీచర్స్ : పప్రస్తుతం క్రెడిట్ కార్డు వాడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. చాలా మంది క్రెడిట్ కార్డు వాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్‌ల ద్వారా క్రెడిట్ కార్డు ఆఫర్ చేస్తున్నారు. అయితే ఇది ఉండటం చాలా వరకు మంచిదే, కానీ దీనిని ఎలా వాడాలో తెలియకపోతే మాత్రం అప్పుల్లో కూరుకపోవడం తప్పదు అంటున్నారు కొందరు. ప్రతి నెలకు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు కొందరు తమకు ఆర్థికంగా డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో కట్టకుండా వదిలేస్తారు. దీంతో పెనాల్టీ పడుతుంది. దీంతో అది అలానే పెరిగి, వడ్డీ కూడా పెరిగి ఇబ్బందుల్లో పడుతారు. అయితే క్రెడిట్ కార్డు అప్పు, ఈజీగా ఎలా కట్టాలి? దానికి సంబంధించిన చిట్కాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

ఈఎమ్ఐ : క్రెడిట్ కార్డ్ అప్పు చెల్లించడానికి ఈఎమ్ఐ బెస్ట్ ఆప్షన్ దీని ద్వారా ఈజీగా మీరు అప్పు చెల్లించవచ్చు. ఎందుకంటే? ఒక్కసారిగా రుణం చెల్లించడం చాలా కష్టం అందువలన నెలకు ఇంత అని ఈఎమ్ ఐ పెట్టుకొని కొద్ది కొద్దిగా అప్పు మొత్తం క్లియర్ చేయోచ్చు.

తక్కువ వడ్డీ : పర్సనల్ లోన్ పై తక్కువ వడ్డీతో రుణం లభిస్తుంది. అయితే ఇలా వ్యక్తిగత రుణం తీసుకొని క్రెడిట్ కార్డు అప్పు మొత్తం క్లియర్ చేయోచ్చు. దీని వలన ఎలాంటి సమస్య ఉండదు.

క్రెడిట్‌ స్కోరు: బిల్లును తీర్చకుండా ఉండటం వలన క్రెడిట్‌ స్కోరు పడిపోతుంది. క్రెడిట్‌ వినియోగ నిష్పత్తీ పెరుగుతుంది. దీనికి బదులుగా రుణంతో ఒకేసారి బాకీ తీరిస్తే, క్రెడిట్‌ స్కోరు మెరుగయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed