Monihara: భారత అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ‘మొనిహర’

by sudharani |   ( Updated:2024-10-25 15:01:59.0  )
Monihara: భారత అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ‘మొనిహర’
X

దిశ, సినిమా: కరీంనగర్ (Karimnagar)కు చెందిన వారాల అన్వేష్ (Weekly Discovery) డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా రూపొందించిన చిత్రం “మొనిహార” (Monihara). ఈ సినిమా తాజాగా అరుదైన ఘనత (rare feat) సాధించింది. 55 వ అంతర్జాతీయ (International) చలనచిత్రోత్సవానికి ఎంపికయింది. భారత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ 55 వ ఇఫీ 2024 (IFFI IFFI 55 ) నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరుగుతుంది. వివిధ భారతీయ భాషల్లోంచి వచ్చిన నాన్ ఫీచర్ సినిమాల్లోంచి ఎంపికయిన వాటిల్లో ‘మొనిహార’ ఉంది. ఈ చిత్రం బెంగాలీ భాషలో నిర్మించారు. కాగా.. కోల్‌కత్తా (Kolkata)లోని సత్యజిత్ రె ఫిలిం ఇన్స్టిట్యుట్‌లో వారాల అన్వేష్ సినిమాటోగ్రఫీలో పీజీ కోర్స్ పూర్తి చేసాడు.

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ (Rabindranath Tagore) రాసిన ‘మొనిహార’ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి ఇన్స్టిట్యుట్ (Institute) లోనే కోర్సు పూర్తి చేసుకున్న సుభాదీప్ బిస్వాస్ (Subhadeep Biswas) దర్శకత్వ భాధ్యతల్ని నిర్వహించాడు. ఇక గతంలో వారాల అన్వేష సినిమాటోగ్రాఫర్‌గా రూపొందిన ‘అపార్’ అండ్ ‘నవాబి శౌక్’ చిత్రాలు ఇండో బంగ్లాదేశ్ (Bangladesh) షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌తో సహా అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ఎంపిక అయి ప్రదర్శించబడి ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం కూడా 55 వ ఇఫీ 2024కి ఎంపిక కావడంతో.. అన్వేష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story